జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కిరణ్‌కుమార్‌కు ఘన సన్మానం
NTODAY NEWS : చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లంల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉంగరాల కిరణ్‌కుమార్‌ను పాఠశాల యాజమాన్యం, గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు.
విద్యారంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు కిరణ్‌కుమార్ వందశాతం అర్హులని, ఆయన సేవలు పాఠశాలకు ఎంతో గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలుకరాజు ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ జోగు సురేష్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ శ్రీమతి నక్క స్వప్నశేఖర్ కిరణ్‌కుమార్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అవార్డు గ్రహీత శ్రీ ఉంగరాల కిరణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ పురస్కారాన్ని అందించిన అధికారులకు, తనను ఆత్మీయంగా సన్మానించిన పాఠశాల హెచ్‌ఎం, సహచర ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మహమ్మద్ ఆయూబ్ పాషా, ఎం. శ్రీనివాసులు, ఎం. లింగారెడ్డి, కే. కాటమయ్య, ఎ. మౌనిక, జి. శివాని తదితరులు పాల్గొన్నారు.