BREAKING
thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ thumb ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: thumb ● సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ thumb ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: thumb ● సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి
మంచి మాట
Date of Publish : 28 October 2026, 07:42 pm
Posted by : కూనురు మధు

సంగీత దర్శకుడు చరణ్ అర్జున్‌కు ఘన సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
28 Oct, 2026 - 07:42 PM
12 వీక్షణలు


* ‘గరివిడి లక్ష్మి’ సినిమా విజయోత్సవం సందర్భంగా అభినందనలు


NTODAY NEWS ;  చిట్యాల 

 ‘గరివిడి లక్ష్మి’ సినిమా విజయవంతమైన సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, పూలే జాతీయ సేవా పురస్కార గ్రహీత చరణ్ అర్జున్ (చిన్ని చరణ్)ను తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. చరణ్ అర్జున్ స్టూడియోలో కేక్ కట్ చేసి, శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా మేళ్లదుప్పలపల్లి గ్రామానికి చెందిన చరణ్ అర్జున్ తెలుగు సినీ సంగీత రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ‘ఆయుధం’ చిత్రంలోని పాటతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, ‘స్టైల్’, ‘డాన్’, ‘విమానం’, ‘లగ్గం’, ‘గరివిడి లక్ష్మి’ తదితర చిత్రాలకు సంగీతం అందించారని తెలిపారు. తెలంగాణ జానపద సంగీతానికి మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ‘కేసీఆర్ ఏ తల్లి పిల్లోడు’ పాటతో గుర్తింపు పొందిన గాయని వొల్లల వాణి, నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత డా. టి.జి. లింగం గౌడ్ తదితరులు పాల్గొని చరణ్ అర్జున్‌ను అభినందించారు.