BREAKING
thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం
Date of Publish : 02 October 2026, 05:36 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్‌తో ప్రజా రవాణాలో మరింత సమన్వయం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
02 Oct, 2026 - 05:36 PM
2 వీక్షణలు

హైదరాబాద్, అక్టోబరు 2: ప్రజాభవన్‌లో నిర్వహించిన మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ప్రజా రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, కొత్త బస్సుల ప్రవేశం వంటి చర్యలు ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడంలో కీలకంగా ఉన్నాయని పేర్కొన్నారు. మహిళల ఉచిత ప్రయాణ పథకం కింద ప్రభుత్వం ఆర్టీసీకి ఇప్పటివరకు సుమారు రూ.12 వేల కోట్ల మేర నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు.

మెట్రో రైలు, ఆర్టీసీ మధ్య సమన్వయాన్ని మరింత పెంచడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని అన్నారు. మెట్రో స్టేషన్లకు ఆర్టీసీ బస్సుల కనెక్టివిటీని పెంచి మొదటి, చివరి మైలు ప్రయాణాన్ని సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా రవాణా వినియోగం పెరిగితే హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్ ద్వారా ప్రయాణికులు రెండు ప్రజా రవాణా వ్యవస్థలను ఒకే పాస్‌తో వినియోగించుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన కామన్ పాస్‌లో రోజువారీ పాస్ ధర రూ.400, నెలవారీ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించారు.

ఆటో డ్రైవర్ల సమస్యలు, చార్జీల అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. ఆటో డ్రైవర్లతో చర్చించి వారి సమస్యలకు పరిష్కారం చూపేలా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మెట్రో–ఆర్టీసీ సమన్వయంతో చేపట్టిన కామన్ పాస్ కార్యక్రమం ప్రజా రవాణా వ్యవస్థలో మరో ముందడుగుగా నిలుస్తుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన, అందుబాటులో ఉండే, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.