BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 29 September 2026, 02:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జనార్ధనవరం గ్రామంలో రూ.15 లక్షల సిమెంట్ రోడ్లకు భూమిపూజ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Sep, 2026 - 02:59 PM
5 వీక్షణలు

టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పల్లెపండుగ–3.0 పనులకు శ్రీకారం

చాట్రాయి: మండలంలోని జనార్ధనవరం గ్రామంలో పల్లెపండుగ–3.0లో భాగంగా రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు తెలుగుదేశం పార్టీ చాట్రాయి మండల అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపుమేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జనార్ధనవరం గ్రామ ప్రత్యేక అధికారి దేవినేని దమయంతి, చాట్రాయి మండల అభివృద్ధి అధికారి బి.ఎ. సత్యనారాయణ, ఏపీఓ విజయలక్ష్మి, పంచాయతీరాజ్ ఏఈ రఘు, గ్రామ పంచాయతీ కార్యదర్శి హనుమంతరావు తదితరులు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో స్థానిక ప్రజలకు రాకపోకలకు మెరుగైన సౌకర్యం కలగనుంది.

ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావుతో పాటు మండల మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ, సీనియర్ నాయకుడు మందపాటి బసవారెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి బలువూరి రత్తయ్య, వంగల రమేష్, మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు బొద్దు వెంకటేశ్వరరావు, మాదిరాజు ప్రసాద్, నందమూరి ఏసుబాబు, కాలంగి గోపాలరావు, బొరిగొర్ల తిరుపతిరావు, పుల్లపాక రఘుబాబు, నడిపింటి వెంకటేశ్వరరావు, రాచకొండ కృష్ణ, క్లస్టర్ ఇన్‌చార్జి యర్రా రాజబాబు, బూత్ ఇన్‌చార్జి చీపు రామారావు పాల్గొన్నారు.

ఆరుగొలనుపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు పానుగళ్ల కోటేశ్వరరావు, చాట్రాయి మండల బీసీ సెల్ అధ్యక్షుడు చిమటబోయిన పుల్లారావు, పలగాని లక్ష్మీనారాయణ, చీపు ప్రసాద్, చీఫ్ వెంగళరావు, చీపు సత్యనారాయణ, కొత్తగూడెం గ్రామ పార్టీ అధ్యక్షుడు ములగలపల్లి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.