BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 09:17 pm
Posted by : కూనురు మధు

ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలను పెంపొందించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 Oct, 2026 - 09:17 PM
9 వీక్షణలు

ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలను పెంపొందించాలి : మున్సిపల్ కమిషనర్ గురు లింగం

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతంలో లోటు ఏర్పడే అవకాశం ఉన్నందున భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా పట్టణ ప్రజలు ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని చిట్యాల మున్సిపల్ కమిషనర్ గురు లింగం సూచించారు. నీటి వృథాను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వాటర్ ప్లాంట్లు, ఇళ్లలో వాటర్ ఫిల్టర్ల ద్వారా నీటి శుద్ధి ప్రక్రియలో వెలువడే వ్యర్థ జలాలను డ్రైనేజీల్లోకి, రోడ్లపైకి వదలకుండా మొక్కలకు నీరు పోయడం, శుభ్రపరిచే పనులు వంటి అవసరాలకు తిరిగి వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా, ఇళ్లు, భవనాలపై పడే వర్షపు నీటిని వృథాగా బయటకు పోనివ్వకుండా ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాటర్ ప్లాంట్లలో శుద్ధి ప్రక్రియ ద్వారా వెలువడే నీటిని కూడా సాధ్యమైన చోట తగిన విధంగా ఇంకుడు గుంతల్లోకి మళ్లించడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు దోహదపడవచ్చని తెలిపారు. నీటిని వృథా చేయకుండా ప్రతి నీటి చుక్కను పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తు నీటి అవసరాలను తీర్చుకోవచ్చని పేర్కొన్నారు. నేటి నీటి పొదుపే రేపటి నీటి భద్రత అని, చిట్యాల పట్టణ ప్రజలందరూ నీటి సంరక్షణలో భాగస్వాములై ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గురు లింగం విజ్ఞప్తి చేశారు.