BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 10 October 2026, 03:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 03:25 PM
2 వీక్షణలు

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నాయకుల డిమాండ్

ఏలూరు: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్లు తొలగించారన్న ప్రచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారాన్ని సుస్థిరం చేసేందుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.

ఎన్నికల సంఘం తీరును ప్రశ్నిస్తూ నిరసనలు చేపడుతున్న వామపక్ష, కాంగ్రెస్ పార్టీల నాయకులపై కేసులు నమోదు చేయడం, వారిని నిర్బంధించడం సరికాదన్నారు. ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు. తొలగించిన ఓట్లలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును తిరిగి నమోదు చేయాలని, ఎస్ఐఆర్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రాళ్లబండి లింగరాజు మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా 13.8 కోట్ల ఓట్లు తొలగించారన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించకపోవడాన్ని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుతంగా నిరసన తెలిపే యువతపై పోలీసుల ద్వారా దాడులు చేయించడం అప్రజాస్వామికమని ఆరోపించారు.

బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందేందుకు ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తొలగించిన ఓట్లలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును పునరుద్ధరించాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోందని విమర్శించారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కోట్లాది మంది ఓటర్ల హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ తక్షణమే బేషరతుగా రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

పాల్గొన్న నాయకులు

ఈ ఆందోళనలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పుప్పాల కన్నబాబు, కురేళ్ల వరప్రసాద్, భజంత్రి శ్రీనివాస్, ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ, కొల్లూరి సుధారాణి, ఉప్పులూరి లక్ష్మి, భవాని, కొండేటి రాంబాబు, ఎం.ఏ. హకీమ్, ఆలూరి రమేష్, పుప్పాల నాగేశ్వరరావు, పెంటకోట నూకరాజు, జి. సన్నాసిరావు, జి. దుర్గారావు, పి. లక్ష్మణ్, సుంకర రాంబాబు, పి. నూకరాజు పాల్గొన్నారు.

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.ఎన్.వి.డి. ప్రసాద్, కె. శ్రీనివాస్, నగర కార్యదర్శి పంపన రవికుమార్, నగర నాయకులు కడలి రామాంజనేయులు, ఎం. ఇస్సాక్, జె. గోపి, తమ్మినేని అరుణకుమారి, ఎస్.ఎస్.ఎన్.వి. ప్రసాద్, ఎర్ర రాంబాబు, గనిగంటి కోటేశ్వరరావు, జి. ఏసుబాబు, ఐ. దుర్గారావుతో పాటు కాంగ్రెస్ నాయకులు ఎస్. బాబు ప్రసాద్, ఎస్.వి. సుబ్బారావు, ఎస్.కె. నజీర్ తదితరులు పాల్గొన్నారు.