బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం
తెలంగాణ
/
సంగారెడ్డి
/
అమీన్‌పూర్
బీరంగూడ: నూతనంగా ఏర్పాటు చేసిన హంపి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వలన అనంతరం షాపింగ్ మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులను అభినందిస్తూ మాల్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, షాపింగ్ మాల్ నిర్వాహకులు, సిబ్బంది, పలువురు స్థానికులు పాల్గొన్నారు.