BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 04:45 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
10 Nov, 2026 - 04:45 PM
22 వీక్షణలు

రూ.40 వేల రుణం చెల్లించాలంటూ వేధింపులు.. కుటుంబ సభ్యులకు నగ్న చిత్రాలు పంపిస్తామని బెదిరింపులు

హైదరాబాద్, పహాడీషరీఫ్ (ఎన్ టుడే న్యూస్):

ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రుణం చెల్లించాలంటూ నిర్వాహకులు పదేపదే ఫోన్లు చేయడంతో పాటు, వ్యక్తిగత ఫొటోలను కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు పంపిస్తామంటూ బెదిరించినట్లు సమాచారం. ఈ వేధింపుల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కానిస్టేబుల్ ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు తెలిసింది.

వివరాల ప్రకారం.. శ్రీను నాలుగు నెలల క్రితం ఓ ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా రూ.40 వేల రుణం తీసుకున్నాడు. అయితే తీసుకున్న రుణాన్ని నిర్ణీత సమయంలో చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి మొదలైనట్లు సమాచారం. అప్పు తిరిగి చెల్లించాలని గంటకోసారి ఫోన్లు చేస్తూ వేధించినట్లు తెలుస్తోంది.

అంతటితో ఆగకుండా శ్రీనును అవమానించేలా బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. అతడికి సంబంధించిన నగ్న చిత్రాలను కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు పంపిస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. అంతేకాకుండా, అతడి భార్యకు సంబంధించిన నగ్న చిత్రాలను కూడా పంపిస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం.

ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల ఆరోపణలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.