BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 08:20 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

క్షుద్ర పూజల ఆరోపణలపై కాంగ్రెస్ నేతలపై హరీశ్‌రావు పరువు నష్టం దావా

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Sep, 2026 - 08:20 AM
16 వీక్షణలు

హైదరాబాద్: తనపై క్షుద్ర పూజలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు సంబంధించి హరీశ్‌రావు సెప్టెంబర్ 24న కోర్టుకు హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 

తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి వీడియోలు, పత్రికా కథనాలు తదితర సాక్ష్యాలను కోర్టుకు సమర్పించినట్లు హరీశ్‌రావు తెలిపారు. తనపై అసత్య ప్రచారం చేసినందుకు ఇప్పటికే న్యాయపరమైన నోటీసులు ఇచ్చామని, బహిరంగ క్షమాపణ చెప్పకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 30న జరగనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై తాము ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ నాయకులు తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిపై ప్రశ్నిస్తే డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

శాసనసభను సైతం అబద్ధాలకు వేదికగా మార్చారని హరీశ్‌రావు విమర్శించారు. భవిష్యత్తులో కూడా తనపై లేదా తమ పార్టీ నేతలపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.