అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
అనకాపల్లి, సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 24, గురువారం అనకాపల్లి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.