అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు
ఆంధ్రప్రదేశ్
/
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
అమలాపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) షేక్ మహబూబ్ బాషా తెలిపారు.
ఈ సెలవును Compensatory Holidayగా ప్రకటించినట్లు DEO ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు (MEOలు), అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల నిర్వహణకు సంబంధించి జిల్లా అధికారుల సూచనలను పాటించాలని తెలిపారు.