BREAKING
thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం
Date of Publish : 23 September 2026, 07:10 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గోవిందరావు, చంద్రరావుకు గౌరవ డాక్టరేట్ అవార్డు

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Sep, 2026 - 07:10 AM
4 వీక్షణలు

విశాఖపట్నం: నందు యువజన సేవా సంస్థ (ఎన్‌వైఎస్ఎస్) అందిస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా సంస్థ గౌరవ అధ్యక్షుడు బుడుమూరు గోవిందరావు, సంస్థ వ్యవస్థాపకుడు కోవెల చంద్రరావుకు గౌరవ డాక్టరేట్ అవార్డు లభించింది. దక్షిణాఫ్రికాలోని వెస్ట్రన్ కేప్, వెల్లింగ్టన్‌కు చెందిన ఎపికైజో ప్రొఫెటిక్ బైబిల్ యూనివర్సిటీ ఈ గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేసింది.

ఆదివారం విశాఖపట్నంలోని సీతమ్మధార సింధూర గెస్ట్‌హౌస్‌లో ప్రత్యేక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు బుడుమూరు గోవిందరావు, కోవెల చంద్రరావు మాట్లాడుతూ తమ సేవా సంస్థకు ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందన్నారు. నందు యువజన సేవా సంస్థకు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన 12ఏ, 80జీ, సి.ఎస్.ఆర్., ఎఫ్.సి.ఆర్. వంటి సేవా అర్హతలు ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలతో పాటు వివిధ ప్రాంతాల్లో సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్ అవార్డులు ప్రదానం చేసినట్లు వారు తెలిపారు. గత 16 సంవత్సరాలుగా నందు యువజన సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందిందని బుడుమూరు గోవిందరావు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సేవా కార్యక్రమాలను విస్తరించి, అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొని గోవిందరావు, చంద్రరావును అభినందించారు. సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆకాంక్షించారు.