BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 03:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. చెరువు వైపు వెళ్లాలంటేనే జంకుతున్న రైతులు!

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Nov, 2026 - 03:00 PM
20 వీక్షణలు

కొండాపూర్ మండలం, నవంబర్ 10: సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానిక గ్రామస్తులు, రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామ సమీపంలోని చౌదరి చెరువులో మంగళవారం ఉదయం భారీ మొసలి రైతుల కంటపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. చెరువులో సంచరిస్తున్న మొసలిని చూసిన రైతులు భయాందోళనకు గురయ్యారు. ప్రతిరోజూ వ్యవసాయ పనుల నిమిత్తం చెరువు కట్ట మీదుగా పంట పొలాలకు వెళ్లే రైతులు, పశువులను చెరువులోకి తీసుకెళ్లి నీళ్లు తాపే గ్రామస్తులు ప్రస్తుతం తీవ్ర భయంతో వెనకడుగు వేస్తున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి మొసలి దాడి చేస్తుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ముఖ్యంగా పశువుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో భారీ మొసలి సంచరిస్తున్నట్లు తెలిసినా సంబంధిత అధికారులు వెంటనే స్పందించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు తక్షణమే చౌదరి చెరువు వద్దకు చేరుకుని మొసలి కదలికలను గుర్తించి, సురక్షితంగా బంధించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మొసలిని పట్టుకునే వరకు చెరువు పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.