BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 12:26 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హురున్ రిచ్ లిస్ట్‌లో హైదరాబాద్ హవా.. టాప్-100లో ఏడుగురు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
25 Sep, 2026 - 12:26 PM
9 వీక్షణలు

హైదరాబాద్, సెప్టెంబర్ 25: దేశంలోని సంపన్నుల జాబితాలో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు మరోసారి సత్తా చాటారు. తాజాగా విడుదలైన M3M Hurun India Rich List 2026లో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు వ్యాపార దిగ్గజాలు టాప్-100లో చోటు దక్కించుకున్నారు. వీరందరి కలిపిన సంపద విలువ ఏకంగా రూ.4,01,200 కోట్లుగా నమోదైంది.

హైదరాబాద్‌కు చెందిన సంపన్నుల్లో దివీస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన మురళి దివి, కుటుంబం రూ.1,25,400 కోట్ల సంపదతో ముందంజలో ఉన్నారు. అనంతరం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు చెందిన పి. పిచ్చిరెడ్డి రూ.53,100 కోట్లతో, పి.వి. కృష్ణారెడ్డి రూ.52,100 కోట్లతో నిలిచారు.

హైదరాబాద్‌కు చెందిన టాప్-100 సంపన్నుల వివరాలు ఇలా ఉన్నాయి:

  • మురళి దివి & కుటుంబం – రూ.1,25,400 కోట్లు

  • పి. పిచ్చిరెడ్డి – రూ.53,100 కోట్లు

  • పి.వి. కృష్ణారెడ్డి – రూ.52,100 కోట్లు

  • శ్రీధర్ పిన్నపురెడ్డి & కుటుంబం – రూ.46,100 కోట్లు

  • పి.వి. రాంప్రసాద్ రెడ్డి – రూ.39,900 కోట్లు

  • బి. పార్థసారథి రెడ్డి & కుటుంబం – రూ.39,400 కోట్లు

  • సురేందర్ పాల్ సింగ్ సలూజా & కుటుంబం – రూ.35,200 కోట్లు

ఈ జాబితాలోని సంపన్నులు ఫార్మాస్యూటికల్స్, మౌలిక వసతులు, డేటా సెంటర్లు, ఇంధన రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దివీస్ ల్యాబొరేటరీస్, మేఘా ఇంజినీరింగ్, CTRL S డేటాసెంటర్స్, అరబిందో ఫార్మా, హెటెరో ల్యాబ్స్, ప్రీమియర్ ఎనర్జీస్ వంటి సంస్థలతో వీరి సంపద అనుబంధమై ఉంది.

నగరాల వారీగా చూస్తే, హురున్ జాబితాలో సంపన్నుల సంఖ్య పరంగా హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ముంబైలో 465 మంది, న్యూఢిల్లీలో 236 మంది, బెంగళూరులో 129 మంది ఉండగా, హైదరాబాద్‌లో 114 మంది చోటు దక్కించుకున్నారు. ఈ 114 మంది హైదరాబాద్ వాసుల మొత్తం సంపద రూ.10,03,800 కోట్లుగా నమోదైంది.

ఇక దేశవ్యాప్తంగా గౌతమ్ అదానీ & కుటుంబం రూ.9.23 లక్షల కోట్ల సంపదతో ఈసారి హురున్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ముకేశ్ అంబానీ & కుటుంబం రూ.8.63 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు.

M3M Hurun India Rich List 2026 ప్రకారం, దేశంలో కనీసం రూ.1,000 కోట్ల సంపద కలిగిన వారి సంఖ్య 1,810కి చేరింది. అలాగే భారత్‌లో డాలర్ బిలియనీర్ల సంఖ్య 391కి పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఈ సంపద లెక్కలు 2026 ఆగస్టు 24 నాటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని రూపొందించారు.