ఐదు షూట్‌ఆఫ్స్‌లో ఒత్తిడిని అధిగమించిన హైదరాబాద్ షూటర్
ఈషా సింగ్‌కు రజత పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్, సెప్టెంబర్ 28:
జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన భారత షూటర్, హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు.
ఫైనల్‌లో ఈషా సింగ్ ఐదు షూట్‌ఆఫ్స్‌ను ఎదుర్కొని రజత పతకాన్ని సాధించింది. చైనా షూటర్ షియావో జియారుయిక్సియాన్‌తో జరిగిన గోల్డ్ మెడల్ షూట్‌ఆఫ్‌లో స్వల్ప తేడాతో ఓటమి చెందడంతో రజతంతో సరిపెట్టుకుంది. ఈషా 38 పాయింట్లు సాధించగా, షియావో కూడా 38 పాయింట్లతో నిలిచింది.
ఈషా ప్రదర్శనను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. షూట్‌ఆఫ్స్‌లో ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కొంటూ చివరి వరకు పోరాడిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై ఈషా చూపిన పోరాట స్ఫూర్తి యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి దేశానికి, తెలంగాణకు పేరు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు.
ఇదిలా ఉండగా, ఈషా సింగ్‌కు రజత పతకం రావడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అభినందనలు తెలిపారు. ఈషా ప్రదర్శనలో నైపుణ్యం, కచ్చితత్వం, స్థిరత్వం కనిపించాయని ప్రశంసించారు.