పొదిలి ప్రెస్ క్లబ్‌కు స్థలం, శాశ్వత భవనానికి సహకరిస్తా
ప్రతి విలేకరికి ఇంటి స్థలం అందేలా కృషి చేస్తా: ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
పొదిలి, సెప్టెంబర్ 28:
మార్కాపురం జిల్లా పొదిలిలో నూతనంగా ఏర్పాటైన పొదిలి వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ (PWJPC)ను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులతో కొంతసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు తమ పాత్రను కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రెస్ క్లబ్ కార్యకలాపాలు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యవర్గ సభ్యులతో చర్చించారు.
పొదిలి వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్‌కు త్వరలో స్థలం కేటాయించేందుకు, శాశ్వత భవన నిర్మాణానికి సహకరిస్తానని కందుల నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. అలాగే అర్హులైన ప్రతి విలేకరికి ఇంటి స్థలం అందేలా కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యేకు పరిచయం చేశారు. ప్రెస్ క్లబ్‌ను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని, కార్యవర్గానికి తన సహకారం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పొదిలి వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని శాలువాతో సత్కరించారు.