BREAKING
thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం
Date of Publish : 12 October 2026, 03:01 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఐఏఎస్ అధికారి అమ్రపాలికి ఏపీలో మళ్లీ పోస్టింగ్

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
12 Oct, 2026 - 03:01 PM
2 వీక్షణలు

అమరావతి: ఐఏఎస్ అధికారిణి కాటా అమ్రపాలికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ పోస్టింగ్ కేటాయించింది. ఆమెను పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా నియమించింది.

గతంలో ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన అమ్రపాలి సెలవుపై వెళ్లారు. సెలవు కాలం ముగిసిన తర్వాత విధుల్లో చేరేందుకు రిపోర్ట్ చేయకపోవడంతో ప్రభుత్వం ఆమెను పోస్టింగ్ లేని అధికారుల జాబితాలోకి బదిలీ చేసినట్లు సమాచారం.

తాజాగా ఆమె విధుల్లో చేరేందుకు రిపోర్ట్ చేయడంతో ప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. దీంతో అమ్రపాలి మరోసారి పర్యాటక శాఖకు సంబంధించిన బాధ్యతలు చేపట్టనున్నారు.