BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 07:52 pm
Posted by : NTODAY NEWS

గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
25 Sep, 2026 - 07:52 PM
15 వీక్షణలు

పల్లివాడ, మునిపంపుల, దుబ్బాక గ్రామాల రోడ్లపై ప్రమాదాల ముప్పు — ఆర్‌అండ్‌బీ ఈఈకి సర్పంచుల వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని దుబ్బాక, మునిపంపుల, పల్లివాడ, ఇంద్రపాలనగరం గ్రామాల పరిధిలో గుంతలమయంగా మారి ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని కోరుతూ పల్లివాడ, మునిపంపుల గ్రామాల సర్పంచులు కమ్మంపాటి శ్రీనివాసులు, బొడ్డుపల్లి వెంకటేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ ఈఈకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ రోడ్లు పూర్తిగా ధ్వంసమై పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో నిత్యం వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులు, రైతులు, ప్రయాణికులు ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొందన్నారు. వర్షాలు పడిన సమయంలో గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రోడ్డు ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు.

ప్రజల రాకపోకలకు అత్యంత కీలకమైన ఈ రోడ్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణమే గుంతలను పూడ్చడంతో పాటు అవసరమైన చోట రోడ్డు మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. సమస్యను తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించి ప్రజలకు సురక్షితమైన రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన రోడ్ల సమస్యపై ప్రభుత్వం, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సర్పంచులు కోరారు.వీరి వెంట తుమ్మలగుడం సర్పంచ్ గర్దాసు విక్రం ఉన్నారు.