BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 02:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తుపాను వేళ తక్షణ స్పందన.. రహదారిపై కూలిన చెట్టును తొలగించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Nov, 2026 - 02:22 PM
6 వీక్షణలు

ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టిన ఎస్ఐ జయబాబు, సిబ్బంది 

మురసు తుపాను ప్రభావంతో ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలో వీచిన ఈదురుగాలులకు ఏపుగుంట గ్రామ సమీపంలో భారీ చెట్టు రహదారిపై కూలిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న టి.నరసాపురం ఎస్ఐ జయబాబు వెంటనే స్పందించి పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. జేసీబీ, చెట్లను కత్తిరించే యంత్రాల సహాయంతో రహదారిపై కూలిన చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు. చెట్టు కొమ్మలు, ఇతర అడ్డంకులను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. తుపాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అత్యవసర సమయాల్లో రవాణాకు ఆటంకాలు ఏర్పడకుండా పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎస్ఐ జయబాబు, పోలీసు సిబ్బంది స్పందించిన తీరుపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో, ప్రమాదకర ప్రాంతాల్లో ఉండకూడదని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీసు శాఖ నిరంతరం అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపడుతుందని ఎస్ఐ జయబాబు తెలిపారు.