BREAKING
thumb ● పుస్తక జ్ఞానంతో పాటు వ్యవసాయ పాఠాలు.. thumb ● మధుమేహంపై అవగాహన కల్పించేందుకు ఖమ్మంలో అవగాహన నడక thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● పుస్తక జ్ఞానంతో పాటు వ్యవసాయ పాఠాలు.. thumb ● మధుమేహంపై అవగాహన కల్పించేందుకు ఖమ్మంలో అవగాహన నడక thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి
Test 4
Date of Publish : 13 November 2026, 01:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో వరి కోత యంత్రాలతో వ్యవసాయ కార్మికులకు ఉపాధి కరువు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Nov, 2026 - 01:03 PM
97 వీక్షణలు
  • యాంత్రీకరణతో కూలీల బతుకులు బుగ్గిపాలు..
  • తుఫాన్ల భయాన్ని ఆసరాగా చేసుకుని యంత్రాల నిర్వాహకుల వసూళ్లు

విస్సన్నపేట: వ్యవసాయ రంగంలో పెరుగుతున్న యాంత్రీకరణ వ్యవసాయ కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ నెల వచ్చిందంటే తుఫాన్ల భయం రైతులను వెంటాడుతోందని, పంట చేతికొచ్చే సమయంలో వాతావరణ హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని వరి కోత యంత్రాల నిర్వాహకులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి కోత యంత్రాల వినియోగం పెరగడంతో వ్యవసాయ కూలీలకు పని దినాలు గణనీయంగా తగ్గిపోతున్నాయని హరినాథ్ పేర్కొన్నారు. గతంలో వరి కోతల సమయంలో కూలీలకు పని దొరకడంతో పాటు కూలి రూపంలో కొంత ధాన్యం కూడా ఇంటికి చేరేదని, వ్యవసాయ పనులు లేని రోజుల్లో ఆ ధాన్యాన్ని దంచుకుని కుటుంబ అవసరాలకు వినియోగించుకునేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం యంత్రాల రాకతో ఆ ఉపాధి అవకాశాలు తగ్గిపోయి వ్యవసాయ కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యంత్రాలతో కోత.. రైతులకు అదనపు భారం యంత్రాలతో కోసిన వరి ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉంటోందని, దీంతో రైతులు తిరిగి కల్లాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. ఆరబెట్టుకునేందుకు తగిన సౌకర్యాలు లేని రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు వెళ్లినప్పుడు తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో దళారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు తుఫాన్ల భయం, మరోవైపు కోతల ఖర్చులు, ధాన్యం ఆరబెట్టే సమస్యలు రైతులను సతమతం చేస్తున్నాయని పేర్కొన్నారు. గడ్డి ధర కూడా బంగారమే పశువులు ఉన్న రైతులు కొందరు మాత్రమే కూలీలతో వరి కోతలు చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారని, దీంతో వరి గడ్డికి సైతం విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని హరినాథ్ తెలిపారు. ఎకరా పొలంలోని వరి గడ్డి ధర రూ.10 వేలకు పైగా పలుకుతోందని పేర్కొన్నారు. వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులు రైతులకు భారంగా మారడంతో పాటు పశువుల మేత కోసం కూడా అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ పంట పండించిన గిరిజన రైతు విస్సన్నపేట ప్రాంతంలో ఓ గిరిజన రైతు ఎల్‌నినో పరిస్థితులు, నీటి కొరతను ఎదుర్కొంటూనే నాట్లు వేసి, బోరు నీటి సాయంతో అధిక పెట్టుబడులు పెట్టి పంటను సాగు చేశారని హరినాథ్ వివరించారు. ఎన్నో కష్టాలు పడి పంటను చేతికి తెచ్చుకునే దశకు చేరుకున్న సమయంలో మళ్లీ తుఫాను హెచ్చరికలు రావడంతో ఆ రైతు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల భయంతో రైతులు నష్టపోతుంటే వారికి అండగా నిలవాల్సిన వ్యవస్థలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతుకు గిట్టుబాటు ధర లేదు.. వినియోగదారుడిపై ధరల భారం ఎల్‌నినో పరిస్థితులు, వ్యవసాయ ఉత్పత్తుల కొరతను కొందరు వ్యాపారులు, దళారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని హరినాథ్ ఆరోపించారు. రైతుకు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదని, అదే సమయంలో బియ్యం ధరలు మాత్రం భారీగా పెంచుతున్నారని విమర్శించారు. కిలో బియ్యం ధరను రూ.100 వరకు పెంచి వినియోగదారులపై భారం మోపుతున్నారని, రైతుకు తగిన ధర దక్కకపోయినా మిల్లర్లు, వ్యాపార వర్గాలు మాత్రం లాభాలు పొందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలతో పాటు వ్యవసాయ కార్మికుల ఉపాధికి జరుగుతున్న నష్టాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని హరినాథ్ కోరారు. రైతులకు గిట్టుబాటు ధర, ధాన్యం ఆరబెట్టుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వ్యవసాయ కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.