BREAKING
thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత thumb ● ఎల్‌-నినో ప్రభావంతో కరువు నివారణకు గ్రామసభలు thumb ● వలిగొండలో ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం thumb ● వలిగొండలో ఇందిరాగాంధీ 42వ వర్ధంతి వేడుకలు thumb ● ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు thumb ● ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● విద్యుత్ శాఖలో వేలాది ఖాళీలు.. భర్తీకి అనుమతులు ఎప్పుడు? thumb ● సంస్థాన్‌ నారాయణపురంలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత thumb ● ఎల్‌-నినో ప్రభావంతో కరువు నివారణకు గ్రామసభలు thumb ● వలిగొండలో ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం thumb ● వలిగొండలో ఇందిరాగాంధీ 42వ వర్ధంతి వేడుకలు thumb ● ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు thumb ● ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● విద్యుత్ శాఖలో వేలాది ఖాళీలు.. భర్తీకి అనుమతులు ఎప్పుడు? thumb ● సంస్థాన్‌ నారాయణపురంలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు
మంచి మాట
Date of Publish : 31 October 2026, 07:23 pm
Posted by : KOLA MAHESH

ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
31 Oct, 2026 - 07:23 PM
18 వీక్షణలు
  • హనుమకొండ డీసీసీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్‌ నాయకులు
  • దేశ సమగ్రత, ఐక్యతకు ఇద్దరు మహనీయుల సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

హనుమకొండ, అక్టోబర్‌ 31 (ఎన్‌ టుడే న్యూస్‌): భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 42వ వర్ధంతి, భారత తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలను శనివారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దేశ సమగ్రతకు పటేల్‌ విశేష కృషి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ సమగ్రత, సమైక్యత, ఐక్యత కోసం జీవితాలను అంకితం చేసిన ఇద్దరు మహనీయులను ఒకే రోజు స్మరించుకోవడం గర్వకారణమని అన్నారు.

వందలాది సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి అఖండ భారత నిర్మాణానికి పునాది వేసిన ఘనత సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడంలో ఆయన చూపిన దృఢ సంకల్పం, నాయకత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.

పేదల సంక్షేమానికి ఇందిరాగాంధీ కృషి

ఇందిరాగాంధీ దేశాభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన నిర్ణయాలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని నాయకులు తెలిపారు. ‘గరీబీ హటావో’ నినాదంతో పేదల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు బ్యాంకుల జాతీయీకరణ, భూసంస్కరణలు వంటి నిర్ణయాలతో సామాజిక, ఆర్థిక రంగాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.

దేశ ఐక్యత, సమగ్రతను కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ సేవలు, త్యాగం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. హనుమకొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ ఖాన్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి, వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ చైర్మన్‌ పులి ప్రియాంక, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బంక సరళ, మాజీ కార్పొరేటర్లు, డీసీసీ కమిటీ సభ్యులు, మండల, డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, నాయకురాళ్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.