BREAKING
thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత
మంచి మాట
Date of Publish : 31 October 2026, 07:21 pm
Posted by : KOLA MAHESH

విద్యుత్ శాఖలో వేలాది ఖాళీలు.. భర్తీకి అనుమతులు ఎప్పుడు?

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
31 Oct, 2026 - 07:21 PM
14 వీక్షణలు


తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంలో సిబ్బంది కొరత తీవ్ర సమస్యగా మారుతోంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన విద్యుత్ సంస్థలైన TGNPDCL, TGSPDCL, TGTRANSCO పరిధిలో వేలాది పోస్టులు ఖాళీగా ఉండటంతో విధుల్లో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరుగుతోంది. ఖాళీల భర్తీకి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ, ఇప్పటివరకు ఆర్థిక అనుమతులు లభించలేదని సమాచారం.

2,200 జూనియర్ లైన్‌మెన్, సబ్‌స్టేషన్ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు

ఆర్థిక అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. ఇంకా రాని ఆమోదం

నలుగురు చేయాల్సిన పనిని ఇద్దరితోనే చేయిస్తున్నారంటూ ఉద్యోగుల ఆవేదన

 మహబూబాబాద్ :అక్టోబర్ 31:

విద్యుత్ శాఖలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారు 2,200 జూనియర్ లైన్‌మెన్, సబ్‌స్టేషన్ ఆపరేటర్ పోస్టులు, 70 సబ్‌ఇంజినీర్ పోస్టులు, 37 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టుల భర్తీ కోసం ఐటీఐ ఎలక్ట్రీషియన్‌తో పాటు సంబంధిత సాంకేతిక విద్యార్హతలు పొందిన వేలాది మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

మరోవైపు కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు, విద్యుత్ డిమాండ్ పెరుగుదల, ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ వినియోగం పెరిగే పరిస్థితులు సిబ్బంది అవసరాన్ని మరింత పెంచుతున్నాయి. అయినప్పటికీ ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో నలుగురు సిబ్బంది చేయాల్సిన పనిని ఇద్దరితోనే చేయించాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ లైన్ల నిర్వహణ, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు వంటి కీలక పనులు పరిమిత సిబ్బందితోనే కొనసాగుతున్నాయని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 12 నుంచి 24 గంటల వరకు విధులు నిర్వహించాల్సి వస్తోందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఉద్యోగ విరమణ చేసిన కొందరు సిబ్బందిని సైతం కాంట్రాక్టు పద్ధతిలో తిరిగి విధుల్లో కొనసాగిస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని సమాచారం.

నిరుద్యోగులకు నోటిఫికేషన్లపై ఆశలు

విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే ఒకవైపు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు మరోవైపు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిపై పనిభారం తగ్గే అవకాశం ఉంది. వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపారాలు, గృహ అవసరాలకు విద్యుత్ అత్యంత కీలకం కావడంతో సిబ్బంది నియామకాలు విద్యుత్ సేవల నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక అనుమతులు మంజూరు చేసి TGNPDCL, TGSPDCL, TGTRANSCO సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు స్పందించి నియామక ప్రక్రియ ప్రారంభిస్తుందోనని వేలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.