సంస్థాన్ నారాయణపురంలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు
దేశాభివృద్ధి, పేదల సంక్షేమానికి ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం: కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వర్ధంతి కార్యక్రమం
యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్): సంస్థాన్ నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. గరీబీ హటావో నినాదంతో పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యం ఇచ్చారని, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు.
పేదల సంక్షేమానికి విశేష కృషి
దేశంలోని బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల సంక్షేమానికి ఇందిరాగాంధీ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని నాయకులు పేర్కొన్నారు. పేదలకు భూముల పంపిణీతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. దేశ తొలి మహిళా ప్రధానిగా ఆమె అందించిన సేవలు నేటి తరాలకు ఆదర్శమని అన్నారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకుడు మందుగుల బాలకృష్ణ, జిల్లా మాజీ కార్యదర్శి ఏపూరి సతీష్, నారాయణపురం మాజీ సర్పంచ్ కొన్‌రెడ్డి నరసింహ, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సనబోయిన నరసింహ, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిలుకూరి శ్రీనివాసులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కిడి మేఘారెడ్డి, సుర్వి ముత్యాలు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రతుపల్లి యాదయ్య, మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు పాల్గొన్నారు.
అలాగే గునిగంటి రాజుగౌడ్, బద్ధుల యాదగిరి యాదవ్, మండల కాంగ్రెస్ నాయకుడు కురుమిద్ద గోపాలు, గ్రామ శాఖ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుత్తా శేఖర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి రేవనపల్లి గోపాల్, నేనావత్ లక్ష్మణ్ నాయక్, పాలకుర్ల స్వామిగౌడ్, గడ్డం రాములు, మేగావత్ గణేష్ నాయక్, మాజీ వార్డు సభ్యుడు బొమ్మరబోయిన రవికుమార్, దౌల ఎల్లయ్య, చిల్లాపురం ఉప సర్పంచ్ లింగంపల్లి పుష్పలత జలంధర్, పర్సనబోయిన యాదయ్య, బండి రవి, మాధరగొని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.