BREAKING
thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత
మంచి మాట
Date of Publish : 31 October 2026, 08:24 pm
Posted by : KOLA MAHESH

వలిగొండలో ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
31 Oct, 2026 - 08:24 PM
4 వీక్షణలు

ఆటో, హమాలీ యూనియన్ల ఆధ్వర్యంలో జెండావిష్కరణ

కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు అవసరం: ఏఐటీయూసీ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ, అక్టోబర్‌ 31 (ఎన్‌ టుడే న్యూస్‌): వలిగొండ మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆటో, హమాలీ యూనియన్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు కనకబోయిన ఆంజనేయులు, మండల ప్రధాన కార్యదర్శి ఎల్లంకి మహేష్‌ యూనియన్‌ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1920 అక్టోబర్‌ 31న ముంబయిలో ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ) ఆవిర్భవించిందని తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం సంఘం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం, ఇన్సూరెన్స్‌, ప్రమాద బీమా, గ్రాట్యుటీ, వైద్య సెలవులు వంటి హక్కుల సాధనలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. బ్యాంకింగ్‌, ఎల్‌ఐసీ, రైల్వే, ఆర్టీసీ, బీటీపీఎస్‌, హెవీ వాటర్‌ ప్లాంట్‌, సింగరేణి, ఎన్టీపీసీతో పాటు ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక సంఘాలపై ఉందని పేర్కొన్నారు.

లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయాలి

ఈ కార్యక్రమానికి హాజరైన సీపీఐ మండల కార్యదర్శి సలిగంజి వీరస్వామి మాట్లాడుతూ.. కార్మికులు ఎన్నో ఏళ్ల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ముప్పు ఏర్పడుతోందని విమర్శించారు. 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

ఈ కోడ్‌లు అమలైతే కార్మికుల హక్కులు, స్వేచ్ఛాయుత పని విధానంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల ఏర్పాటు, నిర్వహణపై ఆంక్షలు విధించే నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగే ఆందోళనల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు సల్వాద్రి రవీందర్‌, మండల నాయకులు చొప్పరి వెంకటేశం, ఆదిమూలం రమేష్‌, నానాచర్ల వెంకటేష్‌, ఆదిమూలం శ్రీకాంత్‌, జక్కుల వెంకటయ్య, ఇంజమూరి సాయిలు, తాల్క యాదయ్య, యాట నరసింహ, శ్యామల నరేష్‌, చంద్రమౌళి, కర్ణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.