వలిగొండలో ఇందిరాగాంధీ 42వ వర్ధంతి వేడుకలు
బ్యాంకుల జాతీయీకరణ, గరీబీ హటావో కార్యక్రమాలను గుర్తుచేసుకున్న నేతలు
ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్): భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 42వ వర్ధంతిని పురస్కరించుకొని వలిగొండ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని సహదేవ గౌడ్, పట్టణ అధ్యక్షుడు పోలేపాక జానకిరాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ భారతదేశ తొలి మహిళా ప్రధానిగా దేశానికి విశేష సేవలందించారని గుర్తుచేశారు. సుమారు 16 సంవత్సరాల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి దేశ పరిపాలనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.
ఆమె పాలనలో 14 బ్యాంకుల జాతీయీకరణ చేపట్టడంతో పాటు ‘గరీబీ హటావో’ నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేశారని కొనియాడారు. దేశాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, మాజీ ఎంపీపీ నూతి రమేష్‌రాజ్, డీసీసీ కార్యదర్శి కుర్షిత్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైసొల్ల ప్రవీణ్, పీఏసీఎస్ డైరెక్టర్ ఎమ్మే మల్లేశం, కాంగ్రెస్ నాయకులు పాలకూర వెంకటేశం, కాసుల వెంకటేశం, కొండూరు సాయి, చిలుకూరు సత్తిరెడ్డి, రాచమల్ల తిరుపతి, దండ మల్లికార్జున, ఎదురుగట్ల బాలనరసింహ, జనగాం దశరథ, కీర్తి రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.