ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు
ఒకే రోజు 100 మందికి పైగా పట్టభద్రుల నమోదు.. అర్హులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రెండు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
ఫౌండేషన్ నిర్వాహకుడు ఇ.ఎల్.వి. భాస్కర్ ఆదేశాల మేరకు శనివారం ప్రారంభించిన ఈ నమోదు కార్యక్రమంలో 100 మందికి పైగా పట్టభద్రులు తమ ఓటు నమోదు చేసుకున్నట్లు సభ్యులు వెల్లడించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నదే ఇ.ఎల్.వి. భాస్కర్ అభిమతమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో కీలకమైనదని, అర్హత కలిగిన పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.
నారాయణపురం మండలంలోని అర్హులైన పట్టభద్రులందరూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రెండు రోజుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పట్నం బాలకృష్ణ, రాసమల్ల ముత్యాలు, సికిలమెట్ల హేమేందర్, గూదె శేఖర్, సురేష్, నాతి లక్ష్మణ్, వలిగొండ యాదయ్య, గవ్వల నాగరాజు, నరాల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.