BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 09:59 pm
Posted by : KOLA MAHESH

ఇందిరమ్మ ఇళ్లు పేదల హక్కు.. రాజకీయ జోక్యాన్ని నివారించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
26 Oct, 2026 - 09:59 PM
10 వీక్షణలు
  • అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలి: సీపీఎం డిమాండ్
  • రాజకీయ సిఫార్సులతో పేదలకు అన్యాయం చేయొద్దు
  • గ్రామానికి 80 ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్

వలిగొండ | ఎన్ టుడే న్యూస్‌ | అక్టోబర్ 26: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యాన్ని నివారించి, అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, సీనియర్ నాయకుడు కళ్లెం సుదర్శన్ రెడ్డి, మండల కార్యదర్శివర్గ సభ్యుడు వాకిటి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవినీతి, అక్రమాలను అరికట్టాలని, అధికార పార్టీ రాజకీయ జోక్యాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి సైదులుకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రాజకీయ జోక్యం చోటుచేసుకుంటోందని ఆరోపించారు. లబ్ధిదారుల ఎంపికలో పేదరికం, అర్హతలు, నిజమైన అవసరాలనే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. రాజకీయ సిఫార్సులకు ప్రాధాన్యం ఇస్తే అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ పెద్దలు అందించే దయాదాక్షిణ్యాలు కావని, అర్హులైన పేదల హక్కు అని పేర్కొన్నారు. గ్రామాల్లో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న కూలీలు, వ్యవసాయ కార్మికులు, నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాజకీయ పలుకుబడి, పార్టీ అనుబంధాల ఆధారంగా ఎంపికలు జరిగితే పథకం లక్ష్యం దెబ్బతింటుందని అన్నారు.

పులిగిల్ల గ్రామానికి 80 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. లబ్ధిదారులను గ్రామసభల ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలని, అన్ని రాజకీయ పార్టీలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి అర్హులను గుర్తించాలని కోరారు.

ఈ కార్యక్రమానికి మారబోయిన నరసింహ అధ్యక్షత వహించారు. సీపీఎం శాఖ సహాయ కార్యదర్శి, 7వ వార్డు సభ్యుడు వేముల నాగరాజు, 9వ వార్డు సభ్యురాలు వేముల అనిత, 1వ వార్డు సభ్యురాలు వడ్డేమాని ధనలక్ష్మీమధు, వడ్డేమాని వెంకటయ్య, దొడ్డి బిక్షపతి, వేముల చంద్రయ్య, బుగ్గ ఐలయ్య, చంద్రమౌళి, బొడ్డు రాములు, వనం యాదయ్య, వరికుప్పల యాదయ్య, వడ్డెమాన్ రవి, వడ్లకొండ శంకరయ్య, మారబోయిన ముత్యాలు, కొమ్మిడి సత్తిరెడ్డి, వరికుప్పల శంకరయ్య, బాబు, ఈర్ల రమేష్, దొడ్డి యాదగిరి, నముద్రిపాల్, భాను తదితరులు పాల్గొన్నారు.