BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 04:49 pm
Posted by : KADARI RAMANA

దేగాం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

తెలంగాణ
/ నిర్మల్ / భైంసా
Reporter
Kadari Ramana నిర్మల్ నియోజకవర్గం
10 Nov, 2026 - 04:49 PM
24 వీక్షణలు

రైతులు వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

బైంసా (ఎన్ టుడే న్యూస్):

రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సూచించారు. మంగళవారం బైంసా మండలంలోని దేగాం, వాలేగాం, కుంసర, కామోల్, ఆనల్‌పాడు, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్‌లో వరికి తక్కువ ధర లభిస్తున్నప్పుడు రైతులకు నష్టం కలగకుండా మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలని సూచించారు. ఏ గ్రేడ్ రకం వరికి క్వింటాలుకు అదనపు ధర విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

దేగాంలో అభివృద్ధి పనుల ప్రారంభం

దేగాం గ్రామంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ చేశారు. అదేవిధంగా రూ.10 లక్షల నిధులతో నిర్మించిన మహిళా షెడ్డు భవనాన్ని ప్రారంభించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్థులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు.

బీజేపీ నాయకుల కుటుంబాలకు పరామర్శ

అంతకుముందు బీజేపీ నాయకుడు కిష్టయ్య కుమారుడి వివాహం సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో గాయపడిన కామోల్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పూజా రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, మాజీ జెడ్పీటీసీ సోలంకే భీమ్రావు, బైంసా మండల బీజేపీ అధ్యక్షురాలు, దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి, సర్పంచులు అశోక్, చిన్నయ్య, నాగలక్ష్మి, వినోద్, సంజీవ్, కుంసర సర్పంచ్ గంగాధర్ పటేల్, అశోక్, సుధాకర్, చందర్ పటేల్, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.