BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 23 September 2026, 07:28 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరిలో అంగన్వాడీ కేంద్రాల తనిఖీ.. ముగ్గురిపై చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
23 Sep, 2026 - 07:28 PM
73 వీక్షణలు

కనిగిరి: ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి కనిగిరి పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు సమాచారం. కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని గుర్తించిన ఆయన సంబంధిత అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

తనిఖీల నేపథ్యంలో కనిగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని సూపర్‌వైజర్‌పై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అలాగే కనిగిరి మున్సిపాలిటీలోని 8వ వార్డు అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన సిబ్బందిపై కూడా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

కనిగిరి పట్టణంలోని కొత్తపేట అంగన్వాడీ కేంద్రాన్ని విజయ ప్రతాపరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో విధులకు గైర్హాజరయ్యారనే కారణంతో అంగన్వాడీ వర్కర్ సత్యవతిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.

అదే కేంద్రానికి సంబంధించిన రికార్డులు, సమాచారాన్ని బయట వ్యక్తులకు చేరవేసి అంగన్వాడీ కేంద్రం ప్రతిష్ఠకు భంగం కలిగించారనే అభియోగంపై అంగన్వాడీ హెల్పర్ రామసుబ్బులును సెప్టెంబర్ 20న విధుల నుంచి తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు.

మరో అంగన్వాడీ సిబ్బందికి కూడా వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మొత్తంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ పర్యటన నేపథ్యంలో సూపర్‌వైజర్‌తో పాటు అంగన్వాడీ వర్కర్, హెల్పర్‌పై చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

అయితే ఆయా చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ఉత్తర్వుల ఆధారంగా మరింత స్పష్టత రావాల్సి ఉంది.