వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన
వరంగల్, సెప్టెంబర్ 25: వరంగల్ నగరంలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా, రోడ్లు, భవనాల శాఖకు చెందిన వికాస్ రాజ్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, సీఎంఓ కార్యదర్శి కె. మాణిక్ రాజ్, ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు ఆసుపత్రి నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతి, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, తదుపరి చేపట్టాల్సిన పనులపై అధికారులు పరిశీలన జరిపారు.
ఉన్నతాధికారుల పర్యటన సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆసుపత్రి నిర్మాణ ప్రాంగణంలో వారికి మొక్కను అందించి స్వాగతం పలికారు.
పర్యటనలో సంబంధిత అధికారులు, నిర్మాణ పనులతో సంబంధం ఉన్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.