శ్రీశైల దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
అమరావతి: శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు, అధికారులు ఆహ్వానించారు.
ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైల దేవస్థానం వేద పండితులు సీఎంకు వేదాశీర్వచనం పలికారు. అనంతరం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాలను దేవస్థానం అధికారులు అందజేశారు.
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చేపడుతున్న ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాల నిర్వహణ, భక్తుల దర్శనం, ఇతర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది.