BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 07 August 2026, 08:12 am
Posted by : NTODAY NEWS

జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
07 Aug, 2026 - 08:12 AM
75 వీక్షణలు

నేతన్నల కృషికి దేశం వందనం.. చేనేత వస్త్రాల వినియోగానికి పిలుపు

హైదరాబాద్, ఆగస్టు 7 (ఎన్‌టుడే న్యూస్):

దేశ చేనేత రంగానికి విశేష సేవలందిస్తున్న నేత కార్మికులను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి అధికారికంగా నిర్వహిస్తోంది.

భారతీయ చేనేత పరిశ్రమ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలవడంతో పాటు లక్షలాది కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తోంది. చేతితో నేసిన వస్త్రాలు కళాత్మకత, నాణ్యత, ప్రత్యేకతకు చిరునామాగా నిలుస్తున్నాయి.

తెలంగాణలో  పోచంపల్లి ఇకత్, గద్వాల్, నారాయణపేట చీరలు, ఆంధ్రప్రదేశ్‌లో ఉప్పాడ, మంగళగిరి, వెంకటగిరి చేనేత వస్త్రాలు దేశ విదేశాల్లో విశేష ఆదరణ పొందుతున్నాయి. చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రజలు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వినియోగించడం ద్వారా నేత కార్మికులకు అండగా నిలవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, చేనేత సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.

" ఇకత్ ను దరిద్దాం"  "చేనేతను ఆదరిద్దాం" – నేతన్నల శ్రమకు గౌరవం తెలుపుదాం" అనే సందేశంతో ఈ దినోత్సవాన్ని అర్థవంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.