ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి సహకరించాలి
- ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను కోరిన తాట్లవాయి గౌడ సంఘ నాయకులు
సమావేశంలో పాల్గొన్నవారు
జగిత్యాల | ఎన్ టుడే న్యూస్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను తాట్లవాయి గ్రామానికి చెందిన గౌడ సంఘ నాయకులు కలిశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఆకుల మల్లేశం ఆధ్వర్యంలో వారు ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి సహకరించాలని గౌడ సంఘ నాయకులు ఎమ్మెల్యేను కోరారు. దీనిపై డా. సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ ఆలయ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తానని తెలిపినట్లు నాయకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, గ్రామ సర్పంచ్ ఆకుల మల్లేశం, జగిత్యాల జిల్లా డీసీసీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సురేందర్ నాయక్, గౌడ సంఘ అధ్యక్షుడు బొమ్మకంటి శ్రీనివాస్, సంఘ సభ్యులు బుర్ర రమేష్, గడ్డం మహేష్, రమేష్, బొమ్మకంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
మెటా కీవర్డ్స్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తాట్లవాయి గౌడ సంఘం, ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి, ఆలయ నిధులు, ఆకుల మల్లేశం, జగిత్యాల వార్తలు, తెలంగాణ రాజకీయాలు, NTODAY NEWS