BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 29 August 2026, 08:58 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులకు ఘన స్వాగతం.. మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:58 AM
83 వీక్షణలు

జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి ఆత్మీయ అభినందనలు తెలిపారు.

ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియలో భాగంగా జిల్లాకు వచ్చిన పరిశీలకులతో కలెక్టర్ కీలక అంశాలపై చర్చించారు. ఓటర్ల జాబితా పారదర్శకత, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా ప్రక్రియ కొనసాగించే అంశాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.