BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 15 August 2026, 03:35 pm
Posted by : MENDI SRINIVASARAO

బి.జె.పురం గ్రామంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
Reporter
Mendi Srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
15 Aug, 2026 - 03:35 PM
53 వీక్షణలు

బి.జె.పురం గ్రామంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 

బి.జె.పురం గ్రామంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మండల రమా శంకర్ రావు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

బి.జె.పురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు విద్యలో ముందంజలో ఉండాలని, వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన సహకారం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ప్రతి విద్యార్థి ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకుని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మండల రమా శంకర్ రావు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండల జ్యోత్స్న, టీడీపీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి సంగం నాయుడు, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ గుణుపూరు లక్ష్మూనాయుడు,గుంట్రెడ్డి పారినాయుడు,తాడంగి పాపారావు, గ్రామ పెద్దలు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.