BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 07:16 pm
Posted by : కూనురు మధు

బీజేపీ కార్మిక విభాగం నల్గొండ జిల్లా కో-కన్వీనర్‌గా జమాండ్ల నవీన్ కుమార్ రెడ్డి

తెలంగాణ
/ నల్గొండ
26 Sep, 2026 - 07:16 PM
60 వీక్షణలు

నల్గొండ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్మిక విభాగం నల్గొండ జిల్లా కో-కన్వీనర్‌గా జమాండ్ల నవీన్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ నల్గొండ జిల్లా లేబర్ సెల్ అధ్యక్షుడు ఐతరాజు సిద్ధు, కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్ అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేశారు.

సమగ్ర సమీక్షతో పాటు సీనియర్ నాయకుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్ధు ఆదేశాల మేరకు నవీన్ కుమార్ రెడ్డిని ఈ బాధ్యతకు ఎంపిక చేసినట్లు నియామక పత్రంలో పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయనకున్న నిబద్ధత, క్రమశిక్షణ, సేవా భావాన్ని గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు.

నూతన బాధ్యతలపై నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

నవీన్ కుమార్ రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని లేబర్ సెల్ నాయకులు తెలిపారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఆయనకు సహకరించాలని కోరారు.