BREAKING
thumb ● జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌..
మంచి మాట
Date of Publish : 30 October 2026, 05:47 pm
Posted by : MUSUGU GOPI

క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే జనసేన సంస్థాగతంగా బలోపేతం

తెలంగాణ
/ తెలంగాణ
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
30 Oct, 2026 - 05:47 PM
13 వీక్షణలు
  • యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం.. బలమైన నాయకులకు త్వరలో ఇన్‌ఛార్జ్ బాధ్యతలు
  • పన్నెండేళ్ల కష్టం వృథా కాకుండా మరో రెండేళ్లు శ్రమించాలి: జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి

హైదరాబాద్, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

జనసేన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడే పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘జనసేన తెలంగాణ అలయ్ బలయ్’ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ ఇన్‌ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి ఆర్.కె. సాగర్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాల్లో యువ నాయకత్వం రావాలని, యువతను ప్రోత్సహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెబుతుంటారని రామ్ తాళ్లూరి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తున్న నాయకులను త్వరలో ఇన్‌ఛార్జులుగా ప్రకటిస్తామని తెలిపారు. పార్టీకి అవసరమైన అన్ని బలాలను సమకూర్చుకుని రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.

పన్నెండేళ్లుగా పార్టీ కోసం పడిన కష్టం వృథా కాకుండా ఉండాలంటే మరో రెండేళ్లు ప్రతి కార్యకర్త, నాయకుడు మరింత కష్టపడాలని అన్నారు. అప్పుడే పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోకి కొత్తవారిని ఆహ్వానిస్తూనే, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న పాత నాయకులు, కార్యకర్తలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.

ప్రస్తుతం పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావును గెలిపించుకోవడమేనని రామ్ తాళ్లూరి అన్నారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీకి నిజమైన బలం పదవుల్లో లేదని, ప్రజలతో మమేకమై నిరంతరం పనిచేసే కార్యకర్తల్లోనే ఉందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన ఆశయాలు, ప్రజాసేవ విలువలను తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో అనుసంధానిస్తూ, ఒకే లక్ష్యంతో పనిచేసే వాతావరణాన్ని నిర్మించడమే ‘జనసేన తెలంగాణ అలయ్ బలయ్’ ఆత్మీయ సమ్మేళనం ప్రధాన ఉద్దేశమని వివరించారు.