BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 29 September 2026, 10:27 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
29 Sep, 2026 - 10:27 PM
6 వీక్షణలు

జనసేనలో 30 కుటుంబాల చేరిక

కదిరి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కదిరి నియోజకవర్గంలోని కదిరి మున్సిపాలిటీలో జనసేన పార్టీ ఆశావహులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ భైరవ ప్రసాద్, కోఆర్డినేషన్ టీమ్ కమిటీ సభ్యుడు పత్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. కదిరి మున్సిపాలిటీలో పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు సమర్థవంతంగా సన్నద్ధం కావడం, ప్రజలతో మరింత బలమైన అనుసంధానం ఏర్పరచుకోవడం వంటి అంశాలపై ఆశావహులతో చర్చించారు. స్థానిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, ఎన్నికలకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కదిరి ఆర్‌అండ్‌బీ బంగ్లాలో ఆశావహులతో విడివిడిగా 1-టు-1 సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు, సూచనలు, స్థానిక పరిస్థితులు, ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా సమష్టిగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కృషి చేయాలని సూచించారు.

అనంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై 30 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి చిలకం మధుసూదన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

కార్యక్రమంలో కదిరి పట్టణ అధ్యక్షుడు కాయల చలపతి, లక్ష్మణ కుటాల, ఇర్ఫాన్, అంజిబాబు, కిన్నెర మహేష్, రాజేంద్ర ప్రసాద్, ఈటీ లోకేష్, చక్రధర్ బాబు, హరిబాబు, కొట్టే అశ్వర్థ, మండల నాయకులు భుక్య రవీంద్ర నాయక్, మేకల చెరువు చౌదరి, సాకే రవికుమార్, కేవీ రమణ, జయవర్ధన్, హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యుడు శ్రీనివాసులు, రెడ్డెమ్మ, జయశ్రీతో పాటు జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.