BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 29 July 2026, 02:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్.. మహిళ ఫిర్యాదులో సంచలన పరిణామం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 02:52 PM
69 వీక్షణలు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై నిర్వహించిన విచారణలో ఆరోపణలకు బలం చేకూరినట్లు అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

విచారణలో, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో సీఐ వ్యక్తిగత సంబంధం కొనసాగించినట్లు, ఆమెను శారీరకంగా దుర్వినియోగం చేసినట్లు తేలినట్లు తెలుస్తోంది. అలాగే మహిళకు సంబంధించిన వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

ఈ వ్యవహారంలో సీఐ, బాధిత మహిళ కొంతకాలం ఒకే ఇంట్లో కలిసి ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. అనంతరం ఆమెను దూరం చేసుకునేందుకు పలుమార్లు ప్రయత్నించినట్లు కూడా విచారణలో బయటపడినట్లు సమాచారం.

ఈ ఆరోపణలను అత్యంత తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు, శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినందుకు శ్రీనివాసులు రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై శాఖాపరమైన చర్యలతో పాటు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.