వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ
ఆంధ్రప్రదేశ్
/
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
రావులపాలెం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులైన గాడి ఝాన్సీని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి సత్కరించారు.
రావులపాలెంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
పార్టీ మహిళా విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.