BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 07:59 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కందుకూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నికల ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
13 Nov, 2026 - 07:59 PM
15 వీక్షణలు

స్ట్రాంగ్ రూమ్, నామినేషన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం పరిశీలన.. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం

కందుకూరు, నవంబర్ 13: కందుకూరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, నామినేషన్ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ముందుగా నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్.. నామినేషన్ ప్రక్రియ సజావుగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా కేంద్రంలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ప్రక్రియలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.

అనంతరం స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరంతరం నిఘా ఉండేలా చూడటంతో పాటు, పోలీసు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు.

కౌంటింగ్ కేంద్రాన్ని కూడా పరిశీలించిన ఆమె.. అక్కడ చేపట్టిన ఏర్పాట్లు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, అవసరమైన ఇతర వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో కందుకూరు మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జారీ: జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఒంగోలు.