BREAKING
thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం
Date of Publish : 02 October 2026, 10:24 pm
Posted by : కూనురు మధు

గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
02 Oct, 2026 - 10:24 PM
15 వీక్షణలు

NTODAY NEWS : చిట్యాల 

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు శుక్రవారం పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారి-65పై ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందిస్తామని పాలక ప్రభుత్వాలు హామీలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికీ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల భద్రత కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న విధంగానే జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందజేసి, అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ వైద్య విధానాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే కొత్త వేతన మండలిని ఏర్పాటు చేయడంతో పాటు నూతన మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షుడు మండే వెంకన్న, ప్రధాన కార్యదర్శి పోకల కరుణాకర్, కోశాధికారి చెరుపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఎల్ల వెంకన్న, సహాయ కార్యదర్శి కూనూరు మధు, సూరపల్లి సూర్యనారాయణ, అమరోజు వెంకన్న, పాల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.