BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 05:48 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

పదవీ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు..

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
29 Aug, 2026 - 05:48 PM
181 వీక్షణలు

కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థి మండలి పదవీ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..

మంచిర్యాల నియోజకవర్గం..

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ (గుడిపేట) లోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థి మండలి పదవీ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  పాల్గొన్నారు..

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విద్యార్థి మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, వారికి బాధ్యతలను అప్పగించారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం, సమాజం పట్ల సేవాభావం పెంపొందించుకోవాలని కలెక్టర్, ఎమ్మెల్యే సూచించారు..

విద్యార్థి మండలి ద్వారా పాఠశాలలో విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం, పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం, తోటి విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవడం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు..

విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, నూతన విద్యార్థి మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు , కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..