BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 04:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కంభంపాడులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 20 కుటుంబాలు ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 04:01 PM
3 వీక్షణలు

నూతనంగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎంపీ ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా మరింత బలం చేకూరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 20 కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మచ్చికంటి రాజశేఖర్ (రాజా), మెంతులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరేందుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సోమవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కేశినేని చిన్ని నూతనంగా పార్టీలో చేరిన సుమారు 20 కుటుంబాలకు స్వయంగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని నాయకత్వంపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కంభంపాడులో చోటుచేసుకున్న ఈ చేరికలతో గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.