BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 12:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుంటూరులో వైభవంగా కార్తీక దీపోత్సవం.. పాల్గొన్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 12:10 PM
21 వీక్షణలు

గుంటూరు నగరంలోని జ్యోతిర్మయి పామ్ స్ప్రింగ్స్, మైత్రి మాల్ పక్కన ఈటీవీ ఆంధ్రప్రదేశ్, శ్రీ భ్రమర గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ కార్తీక దీపోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, శివనామ స్మరణలతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసమని, ఈ మాసంలో దీపారాధన, శివనామ స్మరణ, భక్తి కార్యక్రమాలకు విశేష ప్రాధాన్యత ఉందని తెలిపారు. కార్తీక దీపోత్సవం వంటి వేడుకలు ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన, భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, భ్రమర గ్రూప్ ఆధ్వర్యంలో ఇంతటి వైభవంగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం, సానుకూల భావాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పవిత్ర కార్తీక మాసం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని, ప్రతి కుటుంబానికి శుభం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే గళ్లా మాధవి, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.