BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 06:40 pm
Posted by : కూనురు మధు

కార్తీక మాసం ప్రారంభం.. శివాలయంలో ఆకాశదీపోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
10 Nov, 2026 - 06:40 PM
15 వీక్షణలు

చిట్యాల :  (ఎన్ టుడే న్యూస్)

కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని మంగళవారం చిట్యాల పట్టణంలోని శివాలయంలో ఆకాశదీపాన్ని భక్తిశ్రద్ధలతో వెలిగించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాత్రలో దీపాన్ని వెలిగించి, ధ్వజస్తంభం చివరి వరకు పైకి పంపి ఆకాశదీపోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులు ఆకాశదీపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరహర మహాదేవ, ఓం నమశ్శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కార్తీక మాసం మొత్తం ప్రతిరోజూ సాయంత్రం ఆకాశదీపాన్ని వెలిగిస్తామని పురోహితులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పురోహితులు గోవింద్ శర్మ, బబ్లు శుక్లా, శ్రీ కనకదుర్గ దేవాలయ కమిటీ డైరెక్టర్ రుద్రారపు లింగయ్య, వేలుపల్లి రవీందర్, అన్నపూర్ణ, నామని హరిత, రేగొండ వేణుమాధవ్, ఏళ్ల వెంకన్నతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.