BREAKING
thumb ● కీటకజనిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● కీటకజనిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు
Date of Publish : 26 September 2026, 07:31 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి.. ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Sep, 2026 - 07:31 AM
4 వీక్షణలు

హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తుతో పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన విగ్రహాన్ని వేలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు.

ఉదయం 9.30 గంటలకు ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంది. మార్గమంతా భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలతో సందడి చేశారు.

ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు భారీ క్రేన్ల సహాయంతో మహాగణపతి విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. తమ ఆరాధ్య దైవానికి భక్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జనం ప్రశాంతంగా పూర్తైంది.