ఉరుమడ్లలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ఉరుమడ్ల, సెప్టెంబర్ 27, Ntoday News: గ్రామంలో తెలంగాణ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పట్ల జనార్దన్, వార్డు సభ్యుడు గంగాపురం రాము, పంచాయతీ కార్యదర్శి ఎలేందర్ రెడ్డి తదితరులు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను స్మరించుకున్నారు.
స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు. ప్రజా సమస్యలపై ఆయన చేసిన పోరాటం, సామాజిక న్యాయం కోసం ఆయన అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు అయితరాజు నర్సింహ, రూపని యాదయ్య, కొండ మహేశ్, మాజీ వార్డు సభ్యులు బషీర్, బెల్జ పరమేశ్, మందుగుల జయవర్ధన్, రూపని వెంకన్న, బెల్జ శంకరయ్య, కారోబార్ బెల్జ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.