గ్రేటర్ వరంగల్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
తెలంగాణ
/
హన్మకొండ
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఈసంపల్లి జోనా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఈసంపల్లి జోనా మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సమాజం, ప్రజల కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాపూజీ ఆశయాలు, సేవలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు.