BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 09:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కృష్ణాజిల్లా పరిషత్ పీఠం కూటమి ఖాతాలోకి

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 09:43 PM
19 వీక్షణలు

చైర్‌పర్సన్‌గా భోగాది రమాదేవి.. వైస్ చైర్‌పర్సన్‌గా దండమూడి పూజిత ఏకగ్రీవ ఎన్నిక

మచిలీపట్నం: కృష్ణాజిల్లా పరిషత్‌లో కీలక పదవుల ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా బీజేపీకి చెందిన భోగాది రమాదేవి, వైస్ చైర్‌పర్సన్‌గా దండమూడి పూజిత ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో జిల్లా పరిషత్‌లో కూటమి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. కీలక పదవులకు జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇతర అభ్యర్థుల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాకపోవడంతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారికంగా ప్రకటించారు.

చైర్‌పర్సన్ పదవికి పమిడిముక్కల జడ్పీటీసీ తాతినేని ప్రవళి భోగాది రమాదేవి పేరును ప్రతిపాదించగా, ఘంటసాల జడ్పీటీసీ దోవారి పార్వతి ఆ ప్రతిపాదనను బలపరిచారు. మరోవైపు వైస్ చైర్‌పర్సన్ పదవికి కంకిపాడు జడ్పీటీసీ దండమూడి పూజిత పేరును మచిలీపట్నం సౌత్ జడ్పీటీసీ కాగిత వెంకటేశ్వరరావు ప్రతిపాదించగా, గుడ్లవల్లేరు జడ్పీటీసీ వర్రే బలరాం బలపరిచారు. ఈ రెండు పదవులకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు లేకపోవడంతో ఎన్నికల అధికారులు ఏకగ్రీవ ఎన్నికను ధ్రువీకరించారు.

కృష్ణాజిల్లా పరిషత్‌లో అత్యంత కీలకమైన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. జిల్లా పరిషత్ పాలనలో కొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టనుండటంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలుపై కొత్త పాలకవర్గం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. ఏకగ్రీవ ఎన్నికతో భోగాది రమాదేవి, దండమూడి పూజితకు రాజకీయంగా కీలక బాధ్యతలు దక్కాయి.